హైదరాబాద్ : అభిమానులను విషాదవదనంలో విడిచి వెళ్లిన తెలుగువారి ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్ర ఫిలింఛాబర్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఫిలింఛాబర్‌కు తరలించి అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు అన్నపూర్ణ స్డూడియోలో జరుగనున్నాయి. తమ అభిమాన నటున్ని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అన్నపూర్ణ స్డూడియో నుంచి ఫిలింఛాబర్ వరకు అక్కినేని మృతదేహం ఉంచిన వాహనం వెంబడి పెద్ద అభిమానులు వెంటనడిచారు.




