కాసేపట్లో అన్నపూర్ణ స్డూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ,
ఫిలింఛాంబర్‌కు మృతదేహాన్ని తరలించిన కుటుంబసభ్యులు
హైదరాబాద్ : అక్కినేని భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫిలింఛాబర్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అక్కినేని కుటుంబసభ్యులంతా చివరిసారిగా మహామనిషికి విషణ్ణవదనాలతో శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అక్కినేని భౌతిక కాయాన్ని పూలతో అలంకరించిన వాహనంపైకి తరలించారు.





