Wednesday, 4 November 2026

రాజ్యసభ ఎన్నికలపై చర్చించనున్న అధిష్టానం

హైదరాబాద్‌,జనవరి24: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు తోడు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. వైకాపా ఎన్నికల బరిలో ఉండమని ప్రకటించడంతో కొందరు నేతలు వ్యూహానికి పదను పెడుతున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర కోరుతున్న ఎమ్మెల్యేలు కొందరు ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్లపై ఇప్పటి నుంచే వ్యూహా ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. జెసి దివాకర్‌ రెడ్డి, గంటా శ్రీనివాసరావుల వ్యవహారంపై అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. దీనిపై పిసిసి చీఫ్‌ బొత్స, సిఎం కిరణ్‌లతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభపై ఇప్పటికే నాయకులు పైరవీలు ప్రారంభించారు. మరోవైపు ఏఐసిసి నుంచి వచ్చిన పరిశీలకులు వివిధ లోక్‌సభ స్థానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేశారు. అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి సర్వేకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎఐసిసికి ఫిర్యాదు చేశారు. అవినీతి, గ్రూపు రాజకీయాలను సర్వే ప్రోత్సహిస్తున్నారని మాజీమంత్రి,కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రావు, ఉప్పల్‌ ఎమ్మెల్యే రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు టిక్కెట్‌ ఇవ్వందని వారు అధిష్టానానికి లేఖ రాశారు. మరోవైపు సర్వే మాత్రం తాను మళ్లీ మల్కాజ్‌గిరి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. రాహుల్‌ గాంధీ మంత్రివర్గంలో పనిచేయాలనే అభిప్రాయాన్ని ఆయన తరచూ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి సర్వేకు టిక్కెట్‌ ఇవ్వరాదని అధిష్ఠానానికి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, శంకర్‌రావు ఇప్పటికే ఢిల్లీ వెళ్లగా, మరికొందరు ఎమ్మెల్యేలు రేపు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీ రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించింది. అయితే సిఎం కిరణ్‌ ఢిల్లీకి వెలల్డానికి నిరాకరించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా వారితో రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బొత్స ఢిల్లీ వెళుతున్నారు. సీఎం కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు. విభజనబిల్లుపై ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడినందున శనివారం ఢిల్లీకి వెళ్లివస్తే బాగానే ఉంటుందని సీఎంతో సన్నిహితంగా ఉండే మంత్రులు కొందరు ఆయనకు సూచిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆదివారం వెళ్లడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆంధప్రదేశ్‌ కు సంబంధించినంత వరకు రాష్ట్ర ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ కూడా నివేదికను ఇచ్చారు. వీటన్నింటినీ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌ సవిూక్షిస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ ఎన్నికల్లో 15 నుంచి 17 సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌కు 72 మంది సభ్యులున్నారు. వచ్చే నెల ఏడున 15 రాష్లాల్ర పరిధిలోని 55 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లకు చివరితేదీ ఈ నెల 28. ఈలోపే కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశమై.. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే నిర్ణయాధికారాన్ని అధినేత్రి సోనియాగాంధీకి కోర్‌కమిటీ అప్పగించవచ్చని తెలుస్తోంది. అభ్యర్థుల ఖారారులో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా కీలకపాత్ర పోషించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆంధప్రదేశ్‌ అసెంబ్లీలో జరుగుతున్న చర్చ గడువును రాష్ట్రపతి వారంరోజులపాటు పొడిగించిన నేపథ్యంలో.. సోనియాగాంధీ సవిూక్షించారు. ఆంధప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం ముగుస్తున్న దృష్ట్యా.. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు సీట్లను సులువుగా గెల్చుకునే అవకాశం ఉంది. నాలుగోసీటును ఏదైనా మిత్రపక్షానికి వదిలేయాలా? లేక, కొత్తవ్యూహాన్ని ఖరారు చేసి ఆ సీటును కూడా గెల్చుకోవాలా? అన్నదానిపై కాంగ్రెస్‌ తర్జనభర్జన పడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు మరో మూడునెలలే గడువున్న నేపథ్యంలో.. పొత్తుల అంశంపైనా సోనియా దృష్టిసారించినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న దృష్ట్యా.. కొత్త పొత్తుల కోసం కాంగ్రెస్‌ తీవ్రంగా కసరత్తు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీఏలో ఇప్పుడున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎన్‌సీపీ, ఆర్‌ఎల్‌డీతో పొత్తు ఇక విూదట కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, లాలూపార్టీ ఆర్జేడీ, పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జేపీ కాంగ్రెస్‌తో జతకట్టటానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పొత్తు కొనసాగిస్తూనే కొత్త మిత్రులతో స్నేహం కోసం కాంగ్రెస్‌ తీవ్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా, మాయావతి తో చెలిమి చేయటానికి ఉత్సుకత చూపిస్తోంది. యూపీఏ గూటికి బీఎస్పీ వస్తే.. 120 లోక్‌సభ స్థానాలున్న యూపీ, బీహార్‌లలో పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఏడాదికిందటి వరకూ యూపీఏలో ఉన్న డీఎంకేను తిరిగి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆజాద్‌ ఇటీవల కరుణానిధిని కలిసి చర్చలు జరిపారు. ఇవన్నీ కూడా రాజ్యసభ ఎన్నికలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *