ప్రభుత్వ నివేదిక కోరిన సుప్రీం
కోల్‌కతా,జనవరి24: పశ్చిమబెంగాల్‌లోని బీర్బమ్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం సంఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఓ యువతిని పంచాయితీ తీర్పు మేకు సామాఊహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించినందుకు ఒక యువతికి స్థానిక పంచాయతీ పెద్దలు 50 వేలు జరిమానా విధించారు. అది చెల్లించలేనన్నందుకు పంచాయతీ ఆమెపై సామూహిక అత్యాచారం శిక్ష విధించింది. 13 మంది ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పంచాయతీ పెద్దలతో సహా నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. అయితే తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను పోలీసు రిమాండు కోరనందుకు ఆ జిల్లా ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల అత్యాచారం కేసులు తరచుగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ¬ంశాఖ వ్యవహారాలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.




