Wednesday, 4 November 2026

ఏకపక్షంగా విభజన బిల్లు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదారబాద్‌: రాష్ట్ర విభజన వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుందో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పకుండా శాసన సభ అభిప్రాయం కోరడమేమిటని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విభజన బిల్లుపై చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్య అంశాలు:

– రాష్ట్ర విభజన జరుగుతున్న శాసన సభకు అసంపూర్ణ సమాచారం ఇచ్చి చర్చించమంటార?

– బిల్లు పంపిన కేంద్రం ఎందుకు విభజన చేస్తుంది. దాని ప్రయోజనాలేమిటి.

-రాష్ట్రానికి ఉన్న అధికారాలు ఎట్టి పరాస్థితుల్లో కేంద్రం తీసుకోవడానికి లేదు.

-శాసనసభకు పింపించింది తుది బిల్లా లేక ముసాయిదా బిల్లా? హోంశాఖ ఇస్తున్న వివరణ గందరగోళంగా ఉన్నాయి.

-సభ్యులు కోరిన వివరాలేవి హోశాఖ నుంచి రాలేదు.

విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యలను చూస్తాం. చేస్తాం అంటే కుదరదు. విభజన వల్ల వచ్చే సమస్యలను ఫలానా విధంగా పరిష్కరిస్తామని స్పష్టత ఇవ్వాలి.

-రాష్ట్రపతి అయినా, ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే.

-అటార్నీ జనరల్‌ ఇచ్చిన అభిప్రాయన్ని కోరగా అది ఇవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *