హైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రసంగం పై టీఆర్‌ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే కర్నూలు వాళ్లు పాస్‌పోర్టు తీసుకోనవసరం లేదని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా దేశం ఒక్కటే అని ముఖ్యమంత్రికి తెలియదా సీఎం ఆ మాట చెబితే బాగుండేదని ఈటేల హితవు పలికారు. 371డీపై ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారని తెలిపారు.
తెలంగాణ కంటే ముందు 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్లు చేశారు. నక్సల్స్ సమస్య, కరెంటు సమస్య ఆర్థిక సమస్య దేశ వ్యాప్తంగా ఉందని ఒక్క తెలంగాణలో లేదని తెలిపారు. రాజ్యంగాన్ని గౌరవించిల్సిన ముఖ్యమంత్రి అవాస్తవాలు ,చెప్పి కేంద్రం పై ఫెడరల్ సమైక్యకు విఘాతం కల్పించారని ఆరోపించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సీఎం మాటతప్పారని ఈ టెల ధ్వజమెత్తారు.




