హైదరాబాద్: శాసన సభలో సీఎం వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగంమంతా అబద్దాలే అని తెలిపారు. నక్సల్స్, మతకలహాల విషయంలో సీఎం అపోహలు సృష్టించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం మతకలహాలు సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆరోపించారు.




