Wednesday, 4 November 2026

బిల్లు వచ్చే సంగతి సీఎంకు తెలియదా: చంద్రబాబు

హైదరాబాద్‌: రాజ్యాంగం ప్రకారమే అందరూ పని చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బిల్లు పై చర్చలో భాగంగా సీఎం చేసిన ప్రసంగం పై చంద్రబాబు స్పందించారు. తనకు తెలియకుండానే బిల్లు వచ్చిందని, అందులో ఏముందో తనుకు తెలియదని సీఎం అన్నారని, విభజన బిల్లు రూపకప్పనలో సమాచారం అంతా సీఎం నుంచి వెళ్లలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మరోకటి కాదన్నారు. అందరూ రాజ్యంగ పరిధికి లోబడి పని చేయాలి తప్ప రాజ్యంగ పరిధిని అధికమించి విచ్చల విడాగా చేయడానికి ఎవరికి అధికారం లేదన్నారు. అన్ని వ్యవస్థలకు అధికారులే కాదు పరిధిలు కూడా ఉన్నాయన్నారు. రాజ్యంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడు కోవాల్సిన బాధ్యత సభ్యులందరి పైనా ఉందన్నారు. లోప భూయిష్టమైన బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీ సిద్దంగా లేదన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై తన అభిప్రాయాన్ని సోమవారం వెల్లడింస్తానని చంద్రబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *