‘ఆప్‌’కి సర్వోదయ పార్టీ మద్దతు

కర్ణాటక: కర్ణాటకకు చెందిన సర్వోదయ పార్టీ ఆప్‌లో విలీనం కావడం లేక మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పలు దళిత, రైతు సంఘాలు కలిసి కర్ణాటక సర్వోదయ పార్టీని ఏర్పాటు చేశాయి. జరవరి 22న జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీపుకున్నట్లు పార్టీ సమన్వయకర్త దేవనూరు మహదేవ తెలిపారు.