Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి నోటీసుపై సభాపతిదే తుది నిర్ణయం దానం నాగేందర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన నోటీసుపై సభాపతి నాదెండ్ల మనోహర్‌ తుది నిర్ణయం తీసుకుంటానని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. ప్రభుత్వ అధినేతగా ఆయన సభాపతికి నోటీసు ఇచ్చారని, మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నందునే ఏకాభిప్రాయం రాదన్న ఉద్దేశంతో కేబినెట్‌లో చర్చించి ఉండకపోవచ్చని దానం చెప్పారు. ముసాయిదా బిల్లు తప్పుల తడకగా ఉందని చంద్రబాబు అనడం తగదన్న మంత్రి కేంద్రం అన్ని అంశాలను పరిశీలించాకే బిల్లును రూపొందించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *