హైదరాబాద్: అమరవీరులు, త్యాగధనులను అందరూ స్మరించుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. 65వ గణతంత్ర వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయసాధనకు కృషిచేద్దామన్నారు. పారదర్శకంగా పనిచేయడంలో తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఐటీ రంగం అభివృద్ధికిప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వివరించారు.
మహనీయుల ఆశయాలను సాద్దిదాం: గవర్నర్




