హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ తో కాంగ్రెస్ అధిష్టానం జగన్నాటకం ఆడిస్తోందని భాజపా విమర్శించింది. రాజ్యాంగ విరుద్దంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. మొత్తం నాటకంలో సోనియా దర్శకత్వం వహిస్తుంటే, దిగ్విజయ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారని, సీఎం ప్రధాన నాటక దారుడిగా మారారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారంతో పాటు విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణం సీఎల్‌పీని సమావేశపరచి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించి, బిల్లును గౌవవించి చర్చకు సహకరించే ముఖ్యమంత్రిని ఎన్ను కోవాలని మరో నేత నాగం జనార్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు.




