రవీంద్రభారతి : శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్ధులు ప్రమోద్ కుమార్ రెడ్డి, సుందరి, నరసింగరావు, మాధవి, రాధారాణి, సాయిశ్రీ, భవాని, అరుణజ్యోతి, శృతిలు కలిసి తమ గురువు మంజులా శ్రీనివాస్‌ను సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ప్రణామ్’ శీర్షికన గురువుకు కృతజ్ఞతాంజలి సమర్పించారు. మంగళవారం రవీంద్రభారతి వేదికపై అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రమోద్ కుమార్ రెడ్డి నిర్వహణలో జరిగినీ ఈ కార్యక్రమంలో తొలుత గురుశిష్య పరంపరా ప్రదర్శనలో శిష్యులు పుష్పాంజలి, తోడై మంగళం, పురందరదాసు కీర్తనకు చక్కటి అభినయాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు.




