Tuesday, 3 November 2026

శాసనసభ గంటపాటు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణ, సీమాధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనల మధ్యే వివక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. చర్చలో పాల్గొనాలని స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోలేదు. సభ్యులు తమ అభిప్రాయలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీమాంధ్ర ప్రాంతనికి చెందిన కంగ్రెస్‌ సభ్యులు మినహా మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఆందోళనకు దదిగారు. తెలంగాణ మంత్రులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. దీంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *