హైదరాబాద్: ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకమని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన ముఖ్యమంత్రే తీర్మానం ప్రవేశపెట్టాలని కాని , మంత్రులతో చర్చించకుండా సీఎం ఇచ్చిన నోటీసు చెల్లదన్నవిషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బిల్లుపై వచ్చిన సవరణలను రాష్ట్రపతికి పంపిస్తామని స్పీకర్ చెప్పారని పేర్కొన్నారు.




