హైదరాబాద్: తెలంగాణవాదాన్ని కొందరు కేంద్ర మంత్రులు భుజాన వేసుకున్నారని తేదేపా నేత పయ్యావుల కేశవ్ విమర్మించారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని సిఫారుసు చేయాల్సింది రాష్ట్రపతి అని ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రపతి రబ్బర్‌స్టాంప్ అని కేంద్ర మంత్రులు భావిస్తామని అన్నారు. తిరస్కరణ తీర్మానాన్ని ప్రశ్నిస్తే గతంలో జరిగిన వాటినీ ప్రశ్నించాల్సిన రాష్ట్రపతికి వివరిస్తామని తెలిపారు. ద్విగ్విజయ్, షిండే, జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.




