హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై టీజేఏసీ ఛైర్మన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన అగదని తెలిసికూడా నాటకాలు ఆడుతున్నారని, కిరణ్ నాటకాలు ఇంకెన్ని రోజులని ఆమన ప్రశ్నించారు. సీఎం కిరణ్ ఇక ప్రాంతానికే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కిరణ్ నాటకాలను తెలంగాణ మంత్రులు ఎదుర్కోవాలన్నారు. లేకపోలే టీ మంత్రులు చరిత్ర హీనులుగా మిగిలి పోతారని ఆయన హెచ్చరించారు. టీ ఎమ్మెల్యేలు రాజ్యసభకు తెలంగాణ అభ్యర్థులనే గెలిపించాలని కోదండరాం కోరారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటనను రెండు భాగాలుగా చూడాలన్నారు. టీ బిల్లుపై అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపిస్తున్నట్లు స్పీకర్ చెప్పారని, ఆ తర్వాతే సీఎం తీర్మానాన్ని ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. నిబంధలను విరుద్ధంగా సీఎం నోటీస్ ఇచ్చారని కోదండరాం మండిపడ్డారు.
సీఎం నాటకాలు ఇంకెన్ని రోజులు ? కోదండరాం





