Tuesday, 3 November 2026

ఘనంగా వసంత పంచమి దినోత్సవం

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : వసంత పంచమిని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మాఘమాసం నెలలో శుభకార్యాలయాలకు అనువైన ముహూర్తాలు ఎంచుకుని పెళ్ళిళ్ళు, గృహనిర్మాణాలు, గృహప్రవేశాలు చేసుకుంటారు. మంగళవారం వసంత పంచమి కావడంతో జిల్లా వ్యాప్తంగా బంగారం, వాహనాలు, ఇళ్ళ స్థలాలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తారు. జిల్లాలో వసంత పంచమి పురస్కరించుకుని అన్ని దేవాలయాల్లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుళ్ళను దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజే కోట్లాదిరూపాయలు విలువ చేసే బంగారం, వాహానాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రసిద్ధమైన బాసర సరస్వతి జన్మదినం కారణంతో బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వసంత పంచమి రోజు శుభకార్యాలు నిర్వహిస్తే మంచిదన్న ఆలోచనతో అనేకమంది మంగళవారం వివిధ కార్యక్రమాలను చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *