Tuesday, 3 November 2026

మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : మాజీ ఎంపీ జిల్లాలో సీనియర్‌ నాయకుడు ఇంద్రకరణ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో డిడిపి, కాంగ్రెస్‌ పార్టీలలో చక్రం తిప్పిన ఇంద్రకరణ్‌రెడ్డి మారిన రాజకీయాల పరిస్థితుల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ పట్ల జగన్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేసి శబ్దతగా ఉన్నారు. ఆయన బిజెపి, టిఆర్‌ఎస్‌లో చేరుతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని ఆయన అనుచరవర్గం ప్రచారాన్ని చేపట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకరణ్‌రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుయాయులు కోరితున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం ప్రజాసమస్యలపై పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల విద్యుత్‌ కోతలు నిరసిస్తూ ధర్నా కూడా చేపట్టారు. కాగా, ఈ నెల 10 నుండి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. ఐదేళ్ళలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకులు పరిష్కరించలేదని స్థానిక ఎమ్మెల్యే ఎన్నో హామీలిచ్చినా వాటిని నేరవేర్చడంలో విఫలమయ్యారని తదితర అంశాలపై ఆయన కుగ్రామమైన ఎల్లపల్లిలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర నిర్మల్‌ నియోజకవర్గమంతా కొనసాగనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *