Tuesday, 3 November 2026

నాగోబా జాతరకు రూ.కోటి మంజూరు చేయాలి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : రాష్ట్రప్రభుత్వం తెలంగాణ పండగల పట్ల వివక్షత చూపుతుందని టిఎన్జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్‌ ఆరోపించారు. మేడారం, నాగోబా జాతరను జాతీయ పండుగలుగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాగోబా జాతర సందర్భంగా దేవీ ప్రసాద్‌ దేవాలయాన్ని సందర్శించి నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించననంతరం మాట్లాడారు. నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం మొక్కుబడిగా 10లక్షల రూపాయలు కేటాయించడం  ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కొమరంభీమ్‌ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ప్రజలు చేపట్టారని తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతర సందర్భంగా శాశ్వతంగా పనులు చేపట్టేందుకు కోటిరూపాయలు మంజూరు చేసి, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూరులో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *