Tuesday, 3 November 2026

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జిల్లాలో భేఖాతరు!

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : కేంద్రప్రభుత్వం ఆధార్‌తో సంబంధం లేకుండా రాయితీపై సిలిండర్లు అందజేయడం, సంవత్సరానికి 12 సిలిండర్లు  అందజేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ జిల్లాలో మాత్రం అమలు కావడం లేదు. గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకమంది ఆధార్‌ను అనుసంధానం చేయకపోవడంతో రాయితీని కోల్పోయే పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి కేంద్రం ప్రకటించిన ఆదేశాలు అమలు అవుతాయని ప్రకటించినప్పటికీ జిల్లాలోని డీలర్లు మాత్రం అమలు చేయడం లేదు. కేంద్రం తీసుకున్న రెండు నిర్ణయాలకు గాను ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని ఆధార్‌ అనుసంధానం లేకుండా రాయితీపై సిలిండర్‌ ఇవ్వాలన్న ఆదేశాలు రాలేదని డీలర్లు చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసినా ఒకటి మాత్రమే వచ్చిందనడం వినియోగదారులకు శాపంగా మారింది. గ్యాస్‌కు ఆధార్‌ అనుసంధానం సంబంధం లేదని, న్యాయస్థానం తీర్పు ఇచ్చినా, అటు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌తో లింకు లేకుండా రాయితీపై సిలిండర్లను అందజేయాలని ఆదేశాలుజారీ చేసిన డీలర్లుమాత్రం అమలు చేయడం లేదు. దీంతో వినియోగదారులు రాయితీని కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత యంత్రాంగం వినియోగదారులు సమస్యను తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *