Tuesday, 3 November 2026

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం:చంద్రబాబు
హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీమంత్రి తోట సర్సింహం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ…. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం కార్యకర్తలు పనిచేస్తారన్నారు. సీమాంధ్రలోనే కాదు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ దెబ్బతినడం తథ్యమన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తెలుగుజాతికి న్యాయం చేయాలని ఆగిపోయానని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రను అభివృద్ది చేసే శక్తి, సామర్ధ్యం తనకు ఉన్నాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *