Tuesday, 3 November 2026

తెలుగువాడి పౌరుషాన్ని చూపాలి అని:పురందేశ్వరి

తెలుగువాడి పౌరుషాన్ని చూపాలి అని:పురందేశ్వరి
హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగువాడి పౌరుషం చూపాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, భాజపా నేత దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురందేశ్వరి పాల్గొని ప్రసంగించారు. తమను పార్లమెంట్‌ వెల్‌లోకి వెళ్లనీయకుండా విభజించిన తీరు తీవ్రంగా భాదించిందన్నారు. విభజన వల్ల తమ ప్రాంతానికి ఏర్పడే నష్టాన్ని ఎలా తీరుస్తారని బిల్లు వచ్చిన సందర్బంలో వెంకయ్యనాయుడు తీవ్రంగా పోరాడారన్నారు. జీవోఎం ముందు తాము ఉంచిన ప్రతిపాదనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *