నెల్లికుదురు వద్ద బోల్తా పడిన ట్రాక్టర్…. ముగ్గురు మృతి
నెల్లికుదురు: వరంగల్ జిల్లా నెల్లికుదురు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునిగెలవీడు గ్రామానికి చెందిన ఎల్తూరి ప్రణీత(2), మహబూబ్ బాద్ మండలం శింగారం గ్రామానికి చెందిన మందుల లలిత(35). ఆమె కుమారై అనూష (15) మృతి చెందగా, మరో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. కంకరలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థాలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని మహబూబ్‌బాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




