
పవన్ మోడీ జపం
అహ్మదాబాద్, మార్చి 21 (జనంసాక్షి) :
పవన్ గుండెలపై తరచూ కనిపిం చే చేగువేరా ఉత్తి బొమ్మేనని తేలి పోయింది. పవన్ అనుసరించే మార్గం చేగువేరాది ఎప్పటికీ కాదని తేలిపోయింది. పవన్ సిని మాల్లోనే కాదు నిజ జీవితం లోనూ గొప్ప నటుడేనని స్పష్ట మైంది. జనసేన అడుగులు బీజేపీకి అనుకూలంగా పడుతు న్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి తన పూర్తి మద్దతు ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవలే పార్టీ ప్రకటన చేసిన పవన్ శుక్రవారం బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కలిసి రాజకీయాలపై చర్చించారు. అనేక అంశాలపై ఇరువురు నేతలు మంతనాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన మొదలు, ఇక్కడి రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు సరియైన విధివిధానాలు లేవు.. కనుకే బీజేపీతో కలిసి పని చేస్తానని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు సరిగ్గా లేదని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలపై మోడీతో చర్చించానని చెప్పారు. తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలన్నదే తన తపన అని చెప్పారు. తనకు పదవులపై వ్యామోహం లేదన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విభేదాలున్నాయని తెలిపారు. సామరస్యం దెబ్బతినడం దేశానికి మంచిది కాదని పవన్ పేర్కొన్నారు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు.
చేగువేరా బొమ్మే




