Monday, 2 November 2026

బాలుడి కిడ్నాప్‌, హత్యాయత్నం

బాలుడి కిడ్నాప్‌, హత్యాయత్నం
విశాఖ, సింధియా: విశాఖపట్నం జిల్లా సింధియా మండలంలోని గణపతినగర్‌కు చెందిన హేమంత్‌(6) అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు కిడ్నాప్‌ చేసి హత్యా యత్నం చేశాడు. గాజువాక పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, కనకరాజు దంపతుల కుమారుడు హేమంత్‌ను పాత కక్షల కారణంగా గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు సోమవారం సాయంత్రం పాఠశాల సమీపంలో కిడ్నాప్‌ చేశాడు. అనంతరం గ్రామ శివారులో రాయితో బాలుడి తలపై మోదాడు. బాలుడు స్తృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకొని నాగేశ్వరరావు వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో గాయాలతో పడి ఉన్న బాలుడిని చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *