తిరుమలలో భక్తు రద్దీ సాధారణం
తిరుపతి, ఏప్రిల్ 5 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శనివారం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు భక్తులు సాధారణస్థాయిలో తిరుమలకు చేరుకున్నారు దీంతో సర్వదర్శనానికి వెళ్ళి వేచి ఉండే భక్తుల కంపార్టుమెంట్లు 16 నిండగా, వీరికి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు 10గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. 300రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3గంటల సమయం పడుతుండగా, కాలిబాటన తిరుమలకు వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 6గంటల సమయం, 50రూపాయల సుదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. క్యూలైన్లో భక్తులకు ఉదయం పాలు, పొంగలిని టిటిడి అధికారులు నిత్యన్నప్రసాద సముదాయం నుండి భక్తులకు అందజేశారు. కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఉచిత,50,100,500రూపాయల గదుల భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కల్యాణకట్టా, నిత్యాన్నప్రసాద సముదాయం వద్ద భక్తుల సాదారణ స్థాయిలో కనిపించారు. ఆలయం లోపల భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు మహాలఘదర్శనాన్ని టిటిడి అధికారులు అమలు చేస్తున్నారు. శుక్రవారం వేకువ జామునుండి అర్థరాత్రి వరకు 55,832 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.