Tuesday, 3 November 2026

శ్రీవారి సేవలో ఇస్త్రో చైర్మన్‌, బృందం

తిరుపతి, ఏప్రిల్‌ 5  : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌(భారత అంతరిక్షపరిశోధన సంస్థ) ఇస్త్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌, పిఎస్‌ఎల్‌వి(పోలార్‌ శాటిలైట్‌ లాంచీంగ్‌ వెహికల్‌)సి-24 ఉపగ్రహం విజయవంతం కావడంతో ఆసంస్థ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ తన బృందంతో స్వామివారిని శనివారం ఉదయం శ్రీవారికి నిర్వహించే నైవేద్య విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 5.14 నిముషాలకు  పిఎస్‌ఎస్‌వి సి-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించామని ఆయన మీడియాకు తెలిపారు. అంతకు ముందు తన బృందంతో వేకువజామున తిరుమలకు చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహ సముదాయం వద్ద జెఈవో శ్రీనివాసరాజు, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి బస  ఏర్పాట్లు చేశారు. కొంతసేపు విరామం తీసుకున్న అనంతరం టిటిడి అధికారులు శనివారం ఉదయం శ్రీవారికి నిర్వహించే నైవేద్య విరామ సమయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మొదట ధ్వజస్తంబానికి మొక్కుకుని స్వామివారి చెంత సిఎస్‌ఎల్‌వి సి-24 రాకెట్‌ నమూనాను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వకుళామాతను సందర్శించి హుండీలో కానుకుల సమర్పించారు. రంగనాయక మండపంలో రాధాకృష్ణన్‌ బృందానికి పండితులు ఆశీర్వచనాలుపలుకగా, జెఈవో శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపగ్రహం విజయవంతం కావడంతో స్వామి వారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. భారతదేశం, అమెరికా, రష్యా, చైనా, జపాన్‌ తదితర దేశాలతో సమానంగా ఉపగ్రహాలను ప్రయోగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *