Tuesday, 3 November 2026

12 నుండి 14 వరకు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 5  : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిసంవత్సరం చైత్ర పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడురోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. చైత్ర శుద్ధ త్రయోదశి అనగా ఏప్రిల్‌ 12వ తేదీన ఉదయం 8గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు నాలుగు మాడావీధుల్లో ఊరేగిన అనంతరం వసంత మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు, ఆస్తానాలు పూర్తైన అనంతరం తిరికి ఆలయానికి చేరుకుంటారు. 13వ తేదీ మలయప్పస్వామివారు ఉదయం 8గంటల నుండి 9గంటల నడుమ బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడా వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు మలయప్పస్వామివారితోపాటు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవ మూర్తులు కూడా వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవ వేడుకలను మూడు రోజుల పాటు శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం ఉంజాల్‌ సేవ, ఆర్జిత బ్రహోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. చివరి రోజు 14వ తేదీన విశేష పూజను కూడా టిటిడి రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *