గుంటూరులో భారీ అగ్నిప్రమాదం
(జనంసాక్షి):
గుంటూరు మంగళదాస్ నగర్ లోని జ్యోతి టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు మూడు గంటలకు పైగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 25 లక్షలు విలువ చేసే కలప కాలిబూడిదయిపోయింది. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగి సకాలంలో మంటలను అదుపు చేశాయి.