Tuesday, 3 November 2026

7,8 జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభలను

7,8 జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి7,8 జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

మల్దకల్ డిసెంబర్ 1(జనంసాక్షి)ఈ నెల 7,8 తేదీలలో హైద్రాబాద్ లో జరిగే పి డి ఎస్ యురాష్ట్ర మహాసభల పోస్టర్స్ గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి శివ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన పాలకులే విద్యను నిర్లక్ష్యం చేయడం వలన బీద,మధ్య తరగతి విద్యార్థులకు విద్య దూరం అవుతున్న పరిస్థితి ఏర్పడింది అన్నారు.ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు దండుకుని దిశగా పావుల కలుపుతున్నారు.అందరికి ఉచిత,నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందించాలని అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని హామీలు ఇచ్చారు,కానీ ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు.విద్యార్థులకు అందించాల్సిన 33 వేల కోట్ల స్కాలర్షిప్ ప్, ఫీజు రివర్స్ మెంట్ విడుదల చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ చేతకని తనానికి నిదర్శనం అన్నారు.ప్రతి విద్యార్థి తన వంతుగా విప్లవాత్మక మైన పోరాటాల్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహాసభలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అశోక్,విక్రమ్, చందు,మహేష్,శ్రీధర్,ప్రవీణ్, రామ్,గణేష్ తదితరులు పాలుగోన్నారు.