Tuesday, 3 November 2026

పెరుగుదల పర్యవేక్షణ

పెరుగుదల పర్యవేక్షణ కార్డులపైతల్లిదండ్రులకుఅవగాహన కల్పించాలిపెరుగుదల పర్యవేక్షణ కార్డులపైతల్లిదండ్రులకుఅవగాహన కల్పించాలి
మల్దకల్ డిసెంబర్ 1 (జనంసాక్షి)మల్దకల్ ప్రాజెక్ట్  కార్యాలయంలోగట్టు మండలం అంగన్వాడి టీచర్స్ కి సెక్టార్ సమావేశం గురువారము జరిగింది.ఈ సమావేశంలో సిడిపిఓ కమలాదేవిహాజరై అంగన్వాడి కేంద్రంలో జరగాల్సిన రోజువారి కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు.రిపోర్ట్స్ అన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.టీచర్లు విధినిర్వహణలో యూనిఫామ్ ధరించాలని ఆదేశించారు. ఆయా ఆయా కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెనూ పాటించాలని చెప్పారు.ప్రతి బుధ ,శనివారాలలో గ్రామంలో జరిగే ఆరోగ్య పోషణ విద్య బుధవారము పేరెంట్స్ మీటింగు కచ్చితంగా నిర్వహించాలి,అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ కమిటీ (ఏఎల్ఎంసి )సమావేశాలు ప్రతినెల ఐదో తారీకు రోజు కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. సభ్యులందరూ పాల్గొనేలా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.పెరుగుదల పర్యవేక్షణ సంబంధించిన గ్రోత్  కార్డులు అన్నీ కూడా  సూచికలను అనుసరించి పూర్తి చేసి పిల్లల తల్లిదండ్రులకు  పంపిణీ చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో  సూపర్వైజర్లునాగరాణి, జయప్రద పాల్గొన్నారు.గట్టు మండలం అంగన్వాడి టీచర్లు హాజరైనారు.