చెన్నై: కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హామీ ఇచ్చారు. మోడీ ఈ రోజు ఫోన్లో ఆమెతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలలో మోడీ నాయకత్వంలో బిజెపి అద్వితీయమైన మెజార్టీ సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ జయలలిత లేఖ రాశారు. ప్రధానిగా మోడీ తన పదవీకాలంలో విజయవంతమైన పాలన అందిస్తారని ఆమె ఆకాంక్షించారు.
ఆ లేఖకు స్పందిస్తూ మోడీ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు ప్రభుత్వానికి సంపూర్ణ సహాకారాలు అందిస్తామని ఆయ జయలలితకు హామీ ఇచ్చారు. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలలో అన్నాడిఎంకె 37 స్థానాలకు గెలుచుకున్నందుకు మోడీ ఆమెకు అభినందనలు తెలిపారు.




