రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్: రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి శివారులోని హర్షగురుకులం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను రైల్వే పోలీసులు ఈ ఉదయం గుర్తించారు. మృతులు కోటగిరి మండలం చేతన్ నగర్ కు చెందిన వాగ్మారే, అనురాధగా గుర్తించారు. కోటగిరి పోలీస్ స్టేషన్ లో గత పదిరోజుల క్రితం అనురాధపై మిస్సింగ్ కేసు నమోదైంది.