Tuesday, 3 November 2026

యుద్దప్రాతిపదికన ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడానికే వార్‌రూమ్ : స్వామిగౌడ్

 హైదరాబాద్, మే 24 : యుద్ధప్రాతిపదకన ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడానికే వార్‌రూమ్ తప్ప ఎవరిపై యద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదనిటీ ఆర్ఎస్ నేత స్వామిగౌడ్ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పక్క రాష్ట్రాలతో తమకు పనిలేదని, ఎవరి రాష్ట్రాన్ని వాళ్లం బాగు చేసుకుందామని సూచించారు. సరస్సు అందంగా ఉండాలంటే గుర్పపుడెక్కలు ఉండకూడదన్న స్వామిగౌడ్ తెలంగాణలో ఉన్న సీమాంధ్ర మిత్రులు వారి వారి ప్రాంతాల్లో వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలని వినతి చేశారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన టి.ఉద్యోగులు ఈ ప్రాంతంలోనే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆంధ్రాప్రాంతంలో ఉన్న టి.ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, తెలంగాణలో వారికి తగిన పోస్టులు ఇస్తామని స్వామిగౌడ్ హమీ ఇచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, నిర్ణయం తీసుకోవడం కోసమే వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశామని మరో నేత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీనికి చంద్రబాబు అనేక అర్థాలు చూపి రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు తమ వివరాలు తెలిపేందుకు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యోగుల ఈమెయిల్ , వెబ్ సైట్ ద్వారా లేదా నేరుగా గానీ తగిన సమాచారాన్ని తెలుపవలసిందిగా శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

వెబ్‌సైట్ వివరాలు : www.trswarroom.com
మెయిల్ ఐడీ :  trswarroom@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *