8కి చేరిన పేలుడు మృతుల సంఖ్య
హైదరాబాద్ : వికారాబాద్ సిలిండర్ పేలుడు ఘటనలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ అనే మహిళ మంగళవారం ఉదయం మరణించింది. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. గత శుక్రవారం వికారాబాద్‌లోని ఒక ఇంటిలో సిలిండర్ పేలింది. ఈ దుర్ఘలనలో తీవ్రంగా గాయపడిన వారని నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో పొందుతున్న సంగతి తెలిసిందే.


