మిర్యాలగూడ జనం సాక్షి.హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల 8న కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు వేలాదిగా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత తరలిరావాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దేవరకొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాల కోఆర్డినేటర్ కుందూరు రఘువీర్ రెడ్డి కోరారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 ఏళ్లలో అధికార బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులు, విద్యార్థులు నష్టపోయారని రఘువీర్ రెడ్డి అన్నారు. పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వాన్ని గద్దె దించితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ మహాసభలో విద్యార్థులు, నిరుద్యోగులకు డిక్లరేషన్ ప్రియాంక గాంధీ విడుదల చేయనున్నారని ఆయన వివరించారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు యువ సంఘర్షణ సభ కాంగ్రెస్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ మహాసభకు నల్గొండ జిల్లా నుంచి వేలాదిమంది విద్యార్థులు నిరుద్యోగ యువత, తరలి రావాలని రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ మహాసభకు నల్గొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నుంచి 3 వేల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు తరలిరానున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, నిరుద్యోగ యువత కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టిపిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్, కాంగ్రెస్ బీసీ సెల్ కోఆర్డినేటర్ మెరుగు శ్రీనివాస్, వేములపల్లి, దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంతారెడ్డి, గాజుల శ్రీనివాస్, సైదులు మాదిగ మైనార్టీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు గౌస్, అబ్దుల్లా, బసవయ్య గౌడ్ ఆవుల బక్కారెడ్డి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, బాలు నాయక్, కోటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.




