Wednesday, 4 November 2026

బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలి. ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి

 

 

 

 

 

 

 

వీణవంక, మే 06 (జనం సాక్షి ) వీణవంక చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడం వలన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం బాల్య వివాహాల నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని స్థానిక ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం లోని స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఈరోజు బాల్యవివాహాలు, సీఎం కప్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, ఐసీడీఎస్ సీడీపీఓ భాగ్యలక్ష్మి అధికారులను అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లలకు బాల్యవివాహాలు చేయడం వలన పుట్టే పిల్లలు అనారోగ్యంగా ఉంటారని, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చెప్పారు చట్టాన్ని అతిక్రమించి ఎవరు ప్రవర్తించినా తగిన చర్యలు తప్పవని అన్నారు. మండలంలో బాల్య వివాహాలు ఎవరి దృష్టికి వచ్చినా అధికారులకు సమాచారం. అందించాలని కోరారు. గ్రామాలల్లో బాల్యవివాహాల నివారణ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలికలు, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వండతో పాటు వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తుందని తెలిపారు
క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో మండల స్థాయిలో క్రీడాపోటీలను నిర్వహించడం జరుగుతుందని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు ఈ నెల మే 15వ తేది నుండి 17 వరకు నిర్వహించే ఈ క్రీడాపోటీలకు వయో పరిమితి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు వయస్సు గల ప్రతీ ఒక్కరు అర్హులని తెలిపారు. ఈ క్రీడల్లో వాలీబాల్. కబడ్డీ, కోకో. అథ్లెటిక్స్ ఉంటాయని క్రీడలో ఆసక్తి గల వారు వీరిని సంప్రదించవలసిన అధికారులు 1.వీరారెడ్డి – బేతిగల్ 2.శిరీష, ఘన్ముక మోడల్ స్కూల్
3. రాజకుమార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గన్ముకుల పీఈటీలను, సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. క్రీడా కారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విడుపు శ్రీనివాస్, సూపర్ వైజర్ అని కిరణ్మయి, స్థానిక ఏ ఎస్ ఐ శ్రీనివాస్ ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.