ఇంటర్‌నెట్ డెస్క్, హైదరాబాద్: లండన్‌లోని అపోలో అనే థియేటర్ పైకప్పు కూలిన ప్రమాదంలో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లండన్ నగరంలో ఎంతో పేరున్న ఈ థియేటర్‌లో 700 మంది వరకు కూర్చునే సౌకర్యముంది. 40 నిమిషాల నిడివిగల ఓ సినిమాను తిలకించడానికి వెళ్లిన ప్రేక్షకులు ఒక్కసారిగా గ్యాలరీ పైకప్పు కూలిపోవడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్ సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.




