
ఖమ్మం, జులై 31 : జిల్లాలోని భద్రాచలం మండలం బండిరేవులో మావోయిస్టులు అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపైనే తాత్కాలిక స్థూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల వారోత్సవాల్లో భాగంగా సెబ్రిదళ సభ్యులు ఈ చర్యకు పూనుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలిసిన సమీప గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు భయాందోళనకు గురవుతున్నారు.




