Monday, 2 November 2026

తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటుకు నొటిఫికేషన్ జారీ

హైదరాబాద్: తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం నొటిఫికేషన్ జారీ చేసింది. ఈఆర్సీ సభ్యులుగా స్వరూప్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఈఏ చైర్మన్ నియామకమయ్యారు. కమిటీకి కన్వీనర్‌గా విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శిని నియమించింది. ప్రభుత్వం త్వరలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఆగస్టు 30లోగా తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఈ లోగా దీర్ఘకాలిక పీపీఏను కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. హైటెన్షన్ లైన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే విద్యుత్ సరఫరా చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *