హైదరాబాద్: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు శనివారం ముంబయిలో ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదాని మోదీ పిలుపుమేరకు నీతా అంబానీ, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో కలిసి ముంబయి రోడ్లపై చీపురు పట్టి శుభ్రం చేశారు. మహారాష్ట్రలో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి మోదీ నియమించిన తొమ్మిది మంది గుడ్‌విల్ అంబాసిడర్లలో నీతా ఒకరు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ… ముంబయిలో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోందని, నగరవాసులు, ఎన్జీవోలు కూడా స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.




