Thursday, 5 November 2026

ఊపందుకున్న కార్డన్ సెర్చ్… సైదాబాద్, కార్మికనగర్‌లలో 18 మంది అరెస్టు..!

హైద‌రాబాద్ జ‌నంసాక్షి

Crime

 

నగరంలో నేరాల అడ్డుకట్టకై పోలీసులు అర్థరాత్రి వేళల్లో జరుపుతున్న తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పోలీసులు సైదాబాద్ సింగరేణి కలనీ, జూబ్లీహిల్స్ కార్మికనగర్, రెహ్మత్ నగర్‌లలో పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. 
ఈస్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 250మంది పోలీసులుతో జరిపిన ఈ అకస్మిక తనిఖీలలో 18మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11వేల గుడుంబా ప్యాకెట్లు, 170 సిలెండర్లు, 17 గ్యాస్ రీఫిల్లింగ్ యంత్రాలను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా ఎనిమిదిమంది రౌడీషీటర్లు, 32మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి 2వేల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 24 వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *