9న మిర్యాలగూడలో ఉచిత పౌర్ణమి పాయస పంపిణీ కార్యక్రమం
ఎమ్మెల్యే భాస్కర్ రావు రాక
మిర్యాలగూడ, జనం సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో గల వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం ఏడు గంటల లకు ఉచితంగా పౌర్ణమి పాయాస పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సర్వరోగ నివారిణి పౌర్ణమి పాయాసాన్ని ఉచితంగా బుధవారం రోజున అందజేస్తున్నామని ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గౌరవ అతిథిగా స్వచ్ఛంద సేవకులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, ప్రత్యేక అతిధులుగా జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మునీర్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత పౌర్ణమి పాయాస పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు హాజరై ఉచిత పాయసాన్ని పొందాలని డాక్టర్ పండిట్ శ్రీనివాస్ కోరారు.




