Wednesday, 4 November 2026

ల్యాబ్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల పై చర్యలు తీసుకోవాలి

ల్యాబ్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల పై చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి)ల్యాబ్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల పై చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో ని ఎస్ ఎఫ్ ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కార్యదర్శి నల్లవల్లి రమేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు ల్యాబ్ మరియు పరీక్ష ఫీజు పేరుతో ఒక్కో విద్యార్థి దగ్గర 2000 నుండి 3000 వరకు అక్రమ ఫీజులకు పాల్పడుతున్నారు దీంతో విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు. అడ్మిషన్ కాకముందు ఒకరకంగా చెప్తూ అడ్మిషన్ అయిన తర్వాత ఫీజుల పేరుతో వేధించడం సరికాదని అన్నారు. కావున జిల్లా అధికారులు చొరవ తీసుకొని అధిక ఫీజులకు పాల్పడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అన్నారు లేనియెడల ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ చంద్ర వర్ధన్ మల్లేష్ కార్తీక్ తదితరులు ఉన్నారు.