అక్టోబర్‌ 9 నుంచి ఇంటర్‌ కాలేజీలకు సెలవులు

హైదరాబాద్‌: అక్టోబర్‌ 9 నుంచి 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ కాలేజీలకు సెలవులు ప్రకింటించారు. త్రైమాసిక పరీక్షలు అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలోని జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవలు ప్రకటించారు. అక్టోబర్‌ 4 నుంచి 10వ తేదీ వరకు త్రైమాసిక పరీక్షలు నిర్వహించాల్సిఉంది. అయితే అక్టోబర్‌ 12నే దుర్గాష్టమి కావటం వల్ల ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ జేఎస్‌వి ప్రసాద్‌ షెడ్యుల్‌లో మార్పు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం ప్రకటించింది.

తాజావార్తలు