హైదరాబాద్ : బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 9వ తేదిలోగా ఇది వాయుగుండంగా మారవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనం బలపడితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే 24 గంటల్లో కూడా వాతావరణం సాధారణంగానే ఉంటుందని తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో ,రాయలసీమ ,కోస్తాంధ్రలో కొన్నిచోట్ల వాతావరణంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు,. ఇక హైదరాబాద్‌లో వాతావరణం కొద్దిగా మేఘావృతమై ఉంటుందని గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ,కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని వెల్లడించారు. ఆగ్నేయ అరేబియ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదికూడా వాయుగుండంగా మారే అవకాశం ఉందని,దీని ప్రభావం భారత్‌పై ఉండదని తెలిపారు.




