Tuesday, 17 November 2026

హైదరాబాద్

యువతి గొంతుకోసిన సహోద్యోగి

అమీర్‌పేట : ప్రేమించడం లేదన్న కోపంతో సహోద్యోగే ఒక మహిళ గొంతు కోసిన సంఘటన సనత్‌నగర్‌లోని ఈఎన్‌ఐ ఆస్పత్రిలో జరిగింది. బాధితురాలిని పోలీసులు చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

బంజారాహిల్స్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి విషం తాగాడు. ఈ ఘటనలో భార్య కుమార్తె మృతి చెందగా అతని పరిస్థితి విషమంగా ఉంది.…

6 వేల పాయింట్ల మార్కు దాటిన నిఫ్టీ

ముంబయి : ‘ఫిస్కల్‌ క్లిఫ్‌’ గండం నుంచి అమెరికా గట్టేక్కడం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో రోజు కూడా భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్‌ 163…

శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు : ఎస్పీ

అనంతపురం : కనగానపల్లి కాంగ్రెస్‌ నేత సుధాకర్‌రెడ్డి హత్య కేసులో పరిటాల రవితనయుడు శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ షానవాజ్‌ ఖాసిం తెలియజేశారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే…

మోడీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఏ మిశ్రా నియామకం సరైనదేనని కోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్ర కెబినెట్‌ను సంప్రదించకుండా గవర్నర్‌ కమలా బెనివాల్‌ లోకాయుక్తను నియమించడాన్ని సవాల్‌…

ఏఎంసీ కేసులో రెండో అనుబంధ అభియోగపత్రం దాఖలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో రెండో అనుబంధ అబియోగ పత్రాన్ని నాంపల్లి కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో ఏడో నిందితునిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌పై  ఈ అభియోగ పత్రం దాఖలైంది. మొత్తం 2,975…

ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టుకు నిందితుల హాజరు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టుకు కోనేరు ప్రసాద్‌, విజయరాఘవ, బీపీ ఆచార్య ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో విజసాయిరెడ్డి కూడా కోర్టు ముందు హాజరయ్యేందుకు వచ్చారు.

అమెరికాకు తప్పిన ‘ఫిస్కల్‌ క్లిఫ్‌ ‘ గండం

వాషింగ్లన్‌ : అమెరికాలో ఫిస్కల్‌ క్లిఫ్‌ గండం నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. 257-167 ఓట్లతో బిల్లుకు సభ్యులు మద్దతు తెలిపారు. వాటంతట అవే అమల్లోకి వచ్చే పన్నుల పెంపు, భారీ స్థాయిలో…

అమెరికాలో కరీంనగర్‌ శాస్త్రవేత్త అదృశ్యం

కరీంనగర్‌: అమెరికాలో ఆచూకీ  లేకుండా పోయిన కరీంనగర్‌ వాసి గురించి విదేశాంగ శాఖకు ఫిర్యాదు అందించి జగిత్యాల మండలం మోరంపల్లికి చెందిన వృక్ష శాస్త్రవేత్త బర్రె రామస్వామి 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వెళ్లాడు. అయితే 9 ఏళ్ల…

సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మహత్య

హైదరాబాద్‌ : యూసఫ్‌గూడ ఇందిరానగర్‌లో సినీ, టీవీ ఆర్టిస్లు సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.