Monday, 16 November 2026

హైదరాబాద్

వాగులో బస్సు బోల్తా : 15 మందికి గాయాలు

ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం నిర్శింహుల గూడెం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వాగులో బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఖమ్మం నుంచి కూసుమంచి మీదుగా నల్లగొండ జిల్లా తుమ్ముగూడెం గ్రామానికి వెళ్లిన…

నిర్మల్‌లోని రైస్‌ మిల్లులో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌: జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌ కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై దర్యాప్తునకు విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

హైచ్‌సీఏ అధ్యక్షుడు వినోద్‌పై కేసు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియోషన్‌ అధ్యక్షుడు జీ వినోద్‌పై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసునమోదైంది. రూ. 12.5 లక్షల ట్రైజరర్‌ అనుమతి లేకుండా వాడుకున్నారని హెచ్‌సీఏకు ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్న నరేష్‌ అనే వ్యక్తి  కోర్టులో ఫిర్యాదు చేశాడు. కోర్టు…

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

ఆదిలాబాద్‌: జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. దిలావార్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌లో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును చూడగానే స్థానిక యువకులు ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పలువురు తెలంగాణ…

ధూంధాం దశాబ్ది ఉత్సవాల పోస్టర్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ధూంధాం కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరూత్రలూగిస్తూ పదేళ్లయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీన నగరంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ధూంధాం అధ్యక్షుడు రసమయి బాలకిషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా…

ఆరో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంటు సదస్సు హైదరాబాదులో

హైదరాబాద్‌: భాత్యనగరం మరో ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక కానుంది. ఆరో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంటు సదస్సు వచ్చే ఏడాది హైదరాబాదులో జరగనుంది. 54 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరవుతారని జనవరి నెలాఖరుకల్లా తేదీలు ఖరారవుతాయని శాసనసభపతి…

19 శాతం పెరిగిన భారత రైల్వేల ఆదాయం

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ – నవంబరు మధ్య కాలంలో భారత రైల్వేల ఆదాయం 19.23 శాతం పెరిగింది. భారత రైల్వేలు ఈ ఏడాది రూ. 78,868 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సరుకు రవాణా ద్వారా రూ.…

డిసెంబరు కరెంటు బిల్లులో మినహాయించుకోండి: సీపీడీసీఎల్‌

హైదరాబాద్‌: సీపీడీసీఎల్‌ పరిధిలోని ఎల్‌టీ వినియోగదారులు జూన్‌ 2010, హెచ్‌టీ వినియోగదారులు మే-2010కి సంబంధించి ఇంధన సర్‌ఛార్జీల మొత్తాన్ని డిసెంబరు 2012 విద్యుత్‌ బిల్లుల్లో మినహాయించుకుని చెల్లించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపులు,…

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి: ఏరాసు

కొత్తపేట: తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని శిల్పి రాజకుమార్‌ ఒడయార్‌ ఇంటికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.…