Saturday, 14 November 2026

హైదరాబాద్

రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థలో రూ.56 కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్‌

హైదరాబాద్‌: రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థలో రూ.56 కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్వవహారంపై మైనర్టీ సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. ఈ వ్వవహారంలో ఇప్పటికే సంస్థ అకౌంటెంట్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఆలీపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఉన్నతాధికారుల పాత్రపై కూడా…

బాబ్లీ కేసులో 16కు వాయిదావేసిన సుప్రీం కుర్టు

ఢిల్లీ: బాబ్లీ కుసులో తుది వాదనలను సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. బాబ్లీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న వాదనలో అర్థంలేదని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. కేవలం తాగునీటీ కోసమే బాబ్లీ నిర్మాణం…

మైనార్టీ సంక్షేమశాఖ విచారణ

హైదరాబాద్‌: రాష్ట్ర మైనార్టీల ఆర్ధిక సంస్థలో రూ.56కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై మైనార్టీ సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సంస్థ అకౌంటెంట్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఆలీపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

నిమ్మగడ్డను కలిసిన సీనీనటుడు నాగార్జున

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సినీనటుడు నాగార్జున కలిశారు. ఈ రోజు నిమ్మగడ్డ ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు నాగార్జున తెలిపారు.

పాదయాత్రపై సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి కలసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రపై నిర్ణయం తీసుకునే విషయంలో జగన్‌తో చర్చించినట్లు తెలిసింది.…

నీరు విడుదల చేయండి

ఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల అధారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో 15 రోజుల్లోగా 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది.

గాలి బెయిల్‌ వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్ధానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

షిండే వ్యాఖ్యలపై పాల్వాయి అసంతృప్తి

  హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాల్వయి గోవర్దన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో కేసీఆర్‌ చర్చలు సంతృప్తి కరంగా జరిగాయన్నారు.…

అంతరించి పోతున్న జాతుల పరిరక్షణకు చర్యలు:ఫారుఖీ

హైదరాబాద్‌: దేశంలో జీవ వైవిద్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లను ఖర్చు చేసిందని, దీనిని ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించి పని చేస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఎం.పారుఖీ వెల్లడించారు.

ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు:ముఖ్యమంత్రి

ఒంగోలు: రాజీవ్‌ యువకిరణాల కింద ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.